Tuesday, November 19, 2024

Earthquake : ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. తీవ్రత 5.3గా నమోదు

ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం తెలిపింది. దీని కేంద్రం భూమికి 146 కిలోమీటర్ల దిగువన ఉంది. దీంతో పాకిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి.

అయితే ప్రస్తుతం ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. అంతకుముందు జనవరి 3న ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించింది. అప్పుడు రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైంది. నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకారం, భూకంప కేంద్రం తజికిస్థాన్‌లోని ఇష్కోషిమ్‌కు దక్షిణంగా 15 కి.మీ దూరంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement