తైవాన్‌ను మరోసారి భూకంపం వణికించింది. ఇవాళ రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. రాజధాని తైపీలో భూకంపం కారణంగా పలు భవనాలు కంపించాయి. 24.9 కి.మీ లోతులోభూకంపం సంభవించినట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది.
- Advertisement -
తైవాన్‌లోని తూర్పు కౌంటీ హువాలియన్‌కు సమీపంలో శనివారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని, నష్టం గురించి ఇంకా అంచనా వేయలేదని వాతావరణ శాఖ తెలిపింది.ఈ నెల ప్రారంభంలోనూ హువాలియన్‌లో 7.2 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి 17 మంది చనిపోయారు. పెద్ద ఎత్తున ఇళ్లులు ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా ఇటీవల కూడా పలుమార్లు భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ఇళ్లులు నేలకొరిగాయి. మరికొన్ని బీటలు వారాయి. ప్రాణ నష్టం సంభవించినట్లుగా వార్తలు రాలేదు. ఆస్తి నష్టం మాత్రమే జరిగినట్లుగా అధికారులు తెలిపారు.