టర్కీ, సిరియాలో భూకంపం మారణహోమం సృష్టించింది. ఈ ఘోర విపత్తులో ఇప్పటివరకు 46,000 మందికి పైగా మరణించగా.. ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. భూకంపం దాటికి లక్షలాది ఇళ్లు నేటమట్టం అయ్యాయి. దీంతో ఎంతో మంది రోడ్డున పడ్డారు. వీరికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక వసతి కల్పించింది. భూకంపం ధాటికి టర్కీలో మూడు లక్షలకు పైగా అపార్ట్‌మెంట్లు ధ్వంసమయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. భూకంపం కారణంగా టర్కీలో ఇప్పటిదాకా 40,402 మంది మరణించగా, పొరుగున ఉన్న సిరియాలో 5,800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఘోరమైన భూకంపం సంభవించి 296 గంటలు గడిచినందున టర్కీలో సహాయ చర్యలను ఈ రోజు ముగించే అవకాశం ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement