Tuesday, November 26, 2024

Earthquake: అసోంలో భూకంపం..భ‌యం గుప్పిట్లో ప్ర‌జ‌లు

అసోంలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. ఉదయం 5 గంటల 42 నిమిషాల సమయంలో గౌహతిలో భూప్రకంపనలు సంభించాయి. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారికంగా వెల్లడించింది.

భూమి లోపల 5 కిలో మీటర్ల లోతులో 26.63 డిగ్రీల అక్షాంశం, 92.08 డిగ్రీల రేఖాంశం మధ్య భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ భూకంప ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. కాగా దేశంలోని పలు ప్రాంతాల్లో కొంతకాలంగా తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement