జమ్మూకశ్మీర్లో మళ్లీ భూకంపం సంభవించింది. 24 గంటల్లో భూకంపం రావడం ఇది రెండోసారి. కిష్ట్వార్లో ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 2.53 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
అంతకుముందు, జమ్మూ కాశ్మీర్లో శుక్రవారం రాత్రి 11 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.2గా నమోదైంది. అయితే, 24 గంటల్లో రెండు భూకంపాలు సంభవించాయి, వాటి తీవ్రత తక్కువగా ఉండటంతో, ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు.