(ప్రభన్యూస్) : అది ఓ ప్రాచీన సూక్తి… ఉదయాస్తమయాలలో పోటీపడుతూ… ఉరకలు వేసే జీవితంలో కష్టతాపాన్ని తట్టుకోలేక ప్రజలు దాహం దాహం అంటున్నారు. నగరాల్లో జీవిం చేవారు. తమ శక్తి కొలది శీతలీకరణ పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎటుచూపిన ఐస్ క్రీమ్‌లు, పండ్లు, రసాలు, చెర ుకు రసాలతో పాటు రకాల ఫాస్ట్ డ్రింక్స్ విక్రయాలు జోరవుతున్నాయి. ఎన్నిఉన్నా మట్టి కుండలోని చల్లని నీటికి సాటి ఏదీ లేదు. కుండ పేదవాడి ఫ్రిజ్.. ఆరోగ్య రీత్యా చెప్పాలంటూ.. ఫ్రి జ్ నీటి కంటే మట్టి కుండలోని చల్లని నీరే ఎంతో శ్రేష్టం. అందుకే చాలా మంది మట్టి కుండలోని నీరు తాగడానికే ఇష్టపడుతున్నారు. వేసవి ఆరంభంలోనే ఎండలు మండి పోతున్నాయి. సూర్యుడి భగభగలకు ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తడారిన గొంతులను తడుపుకునేందుకు చల్లని నీటి కోసం చూస్తున్నారు. పేదోళ్ల కోసం కూజాలు, కుండలు మార్కెట్లో కొలువు దీరుతున్నాయి. ఆరోగ్య రీత్యా సంపన్నులు కూడా కుండ నీటిని తాగేందుకు మొగ్గు చూపుతుండడంతో పేదవాడి ఫ్రిజ్‌లకు గీరాకీ పెరుగుతోంది.
కుండనీటితో ఆరోగ్యం..
వేసవిలోచల్లని నీరు తాగడానికి ఫ్రిజ్‌లు కొనలేని వారికోసం కుండలు సిద్ధమవుతున్నాయి. తక్కువ ఖర్చుతో కరెంట్ వినియోగం లేకుండానే కుండలు చల్లని నీటిని అందిస్తాయి. మనిషి ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం చూపకుండా వేసవి దాహార్థిని తీర్చేవీటిపై సంపన్నులు సైతం మక్కువ చూపుతున్నారు. దీంతో రోజురోజుకు కుండల వినియోగం పెరుగుతోంది. బాటసారులకు నీల్లిందిం చే చల్లివేంద్రాల్లో సైతం పెద్ద సైజులో ఉన్న కూజాల నే వినియోగిస్తారు. అందుకే రకరకాల ఫ్రిజ్‌లు వచ్చినా మట్టి కుండల స్థానం నేటికీ పదిలగానే ఉంది.
తక్కువ ధర..
మొయినాబాద్ మండలంలోని మొయినాబాద్, కేతిరెడ్డిపల్లి,నక్కలపల్లి, చిల్కూర్, రెడ్డిపల్లి, ఎన్కెపల్లి తదితర గ్రామాల్లో మార్కెట్లో కుండలు లభిస్తున్నాయి. ఒక్కో కుండ రూ. 120 నుంచి 140 వరకు ధర పలుకుతోంది. కుండలో నీరు ఆరోగ్యానికి కూడా మేలని వైద్యులు చెబుతున్నరు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..