Saturday, November 23, 2024

ఆఫ్ఘనిస్తాన్‌‌లో భూకంపం.. హడలిపోతున్న ప్రజలు

ఒకవైపు తాలిబన్‌ల కారణంగా భయంతో వణికిపోతున్న ఆప్ఘనిస్తాన్ ప్రజలకు మరో షాక్ తగిలింది. మంగళవారం ఉదయం ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.8 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఫైజాబాద్‌కు 83 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో ప్రజలంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ఓ వైపు తాలిబన్ల వల్ల ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ప్రకృతి కూడా తమకు సహకరించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాలిబన్‌ల కారణంగా తమ స్వేచ్ఛ హక్కులు కోల్పోతామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఇంటి నుండి బయటకు రావడానికి జంకుతున్నారు. తాలిబన్లు ఏ సమయాన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో… ఎవర్ని పట్టుకుని చాంపుతారో అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. మరోవైపు కాబూల్ విమానాశ్రయంలో సోమవారం నాడు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు దేశం విడిచి పారిపోయేందుకు ఎలా ప్రయత్నించారో చూసి ప్రపంచం మొత్తం బాధపడింది.

ఈ వార్త కూడా చదవండి: హైదరాబాద్‌లో ట్రిపుల్ తలాక్ కేసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement