బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైంది. ఈ నేపథ్యంలో ఏపీలోని రాజమండ్రి, కాకినాడలో భూప్రకంపనలు వచ్చాయి. ఈ మధ్యాహ్నం 12:35 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిస్మాలజీ వివరించింది. అటు ఏపీలోని కాకినాడకు దక్షిణ, ఆగ్నేయ దిశలో 296 కిలోమీటర్లు, రాజమండ్రికి దక్షిణాన, ఆగ్నేయంగా 312 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది.
అటు తమిళనాడు రాజధాని చెన్నైలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంప కేంద్రం చెన్నై నగరానికి తూర్పు, ఈశాన్య దిశలో 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంప ప్రభావంతో చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు, ఆఫీసుల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. కాగా ఇది భూకంపం మాత్రమేనని.. ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిస్మాలజీ పేర్కొంది.
ఈ వార్తను కూడా చదవండి: చంద్రబాబు ఇంట్లో పాచి పని చేస్తా: ఏపీ డిప్యూటీ సీఎం