Wednesday, January 8, 2025

Earth Quack – నేపాల్ -టిబెట్ స‌రిహ‌ద్దుల‌లో పెను భూకంపం…భారీగా ప్రాణ‌, ఆస్తి న‌ష్టం

ఇప్ప‌టికే 95 మంది దుర్మ‌ర‌ణం…
100 వందికి పైగా గాయాలు
భారీగా ఆస్తి న‌ష్టం…కుప్ప‌కూలిన ఇళ్లు
రిక్టర్ స్కేలుపై 7.1 పాయింట్లుగా నమోదు
ఢిల్లీ, బిహార్, అసోం, పశ్చిమ బెంగాల్ లలోనూ కంపించిన భూమి
2015 నాటి భూకంపంలో నేపాల్ లో 9 వేల మందికి పైగా మృతి

టిబెట్ లో పెను భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో నేపాల్ – టిబెట్ సరిహద్దుల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1 పాయింట్లుగా నమోదైంది. పలు భవనాలు, భారీ వృక్షాలు నేలమట్టం అయ్యాయి. భూకంపం కారణంగా ఇప్పటి వరకు 95 మంది మరణించారని టిబెట్ అధికారవర్గాలు తెలిపాయి. వంద మందికి పైగా గాయ‌ప‌డిన‌ట్లు చైనా అధికారిక మీడియా సంస్థ జిన్హువా వార్త కథనాలు ప్రసారం చేసింది.

- Advertisement -

ఉదయం వెంటవెంటనే మూడుసార్లు భూమి కంపించిందని, మొదటి భూకంపం తీవ్రత 7.1 పాయింట్లు కాగా ఉదయం 7:02 గంటలకు 4.7 తీవ్రతతో మరోసారి భూమి కంపించిందని, తర్వాత 5 నిమిషాలకు 4.9 తీవ్రతతో మరో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ట్వీట్ చేసింది. భూకంప ప్ర‌భావిత ప్రాంతాల‌లో చైనా స‌హాయ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది.. క్ష‌త‌గాత్రుల‌ను హ‌స్పిట‌ల్స్ కు త‌ర‌లిస్తున్న‌ది. ఇండ్ల శిధిలాల‌లో చిక్కుకున్న వారిని బ‌య‌ట‌కు తీసే కార్య‌క్ర‌మాల‌ను ముమ్మ‌రం చేసింది.. ఇది ఇలా ఉంటే మృతుల సంఖ్య మ‌రింత పేరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు భ‌య‌ప‌డుతున్నారు.

భార‌త్ లోనూ..

భూ ప్రకంపనలు అటు నేపాల్ లో, ఇటు ఇండియాలోని పలు రాష్ట్రాల్లోనూ నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో, బిహార్, అసోం, పశ్చిమ బెంగాల్ లోనూ భూమి కంపించింది. కాగా, భౌగోళిక పరిస్థితులు, భూగర్భంలోని టెక్టానిక్ ప్లేట్స్ కదలికల కారణంగా హిమాలయాల పక్కనే ఉన్న నేపాల్ లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2015లో సంభవించిన పెను భూకంపంలో దాదాపు 9 వేల మంది చనిపోగా, 25 వేల మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 5 లక్షలకు పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement