Earth First Photo: భూమి గుండ్రంగా ఉంటుందని, సూర్యుని చుట్టూ తిరుగుతుందని చదువుకున్నాం. అయితే, భూమి గోళాకారంగా ఉన్నట్టు రుజువుచేసే మొట్టమొదటి ఫొటోను సరిగ్గా 75 ఏండ్ల కింద తీశారు. జర్మనీకి చెందిన నాజీ రాకెట్ వీ-2 భూమికి 105 కిలోమీటర్ల ఎత్తుపై నుంచి 1946 అక్టోబర్ 24న భూమి బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని తీసింది.
రోదసిలో నుంచి భూమి ఫొటోను తీయడం ఇదే మొదటిసారి. ఇప్పటిదాకా దాదాపు 9 లక్షలకు పైగా భూగ్రహ చిత్రాలు తీసినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో ఈ ఫొటో తీయడం అప్పట్లో పెద్ద సంచలనమే మరి.