ఈ మధ్యకాలంలో సినిమాలకి దూరంగా ఉంటోంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించిన హేమకి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది.. ఏ పాత్రలో అయినా సరే ఆమె ఒదిగిపోయి నటిస్తుంది. హాస్యం కూడా పండించగలగటం ఆమె ప్రత్యేకత. సినిమాలకి దూరంగా ఉండటానికి కారణం ఆమెనే వెల్లడించింది. తాను ఈ మధ్యే కొత్త బిజినెస్ ప్రారంభించానని చెప్పింది. అందులో మంచి లాభాలు వస్తున్నాయని తెలిపింది. సంపాదన ఎక్కువ అవడంతో సుఖ పడటం అలవాటైపోయిందని ఆమె వ్యాఖ్యానించింది. కష్టపడటానికి ఇష్టపడటం లేదని చెప్పింది. అందుకే నటనకు దూరంగా ఉంటుందన్నట్టు తెలిపింది. అయితే, తన బిజినెస్ ఏమిటన్న వివరాలను మాత్రం చెప్పలేదు.
Advertisement
తాజా వార్తలు
Advertisement