Saturday, November 23, 2024

ముందస్తు ‘అకాడమిక్’ బాదుడు షురూ..!

గ్రేటర్‌ పరిధిలోని ప్రైవేట్‌, కార్పొరేట్‌, ఇంటర్నేష నల్‌ పాఠశాలల యాజమాన్యాల వ్యవహారం రోజు రోజుకు శృతిమించిపోతోంది. ప్రభుత్వం ఇప్పటి వరకు 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన షెడ్యూలును ప్రకటించనప్పటికీ… తమకేమి సంబంధం లేదంటూ ప్రైవేట్‌ విద్యా సంస్థలు తమకు తామే షెడ్యూలును ప్రకటించుకుని దోపిడికి తెర లేపాయి. 2021-22 విద్యా సంవత్సరంలో సెప్టెంబర్‌, 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. గతంలో కొవిడ్‌ రెండో దశ నేపథ్యంలో ఆలస్యంగా ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి.

అయితే కొవిడ్‌ మహమ్మారి ఫోర్త్వేవ్ వస్తుందన్న సంకేతాలున్న తరుణంలో ప్రస్తుతం మహానగరంలో కేసులు తగ్గుముఖం పట్టడంతో వ్యాపారానికి తెర లేపారు. గతంలో కొవిడ్‌ కంటే ముందు ప్రతి సంవత్సరం ఏటాలో వేల కోట్ల వ్యాపారం చేస్తున్న.. శ్రీచైతన్య, నారాయణ(చైనా) మాఫియా సైతం ఇప్పటికీ అవే విధానాలు అనుసరిస్తోంది. దీనికి పాఠశాల, ఇంటర్మీడియెట్‌ అధికారులు సైతం చైనా మాఫియాకు పూర్తిగా అండదండలు అందిస్తున్న తరుణంలో చైనా మాఫియా మూడు పువ్వులు ఆరు కాయలు చందంగా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని రోజు రోజుకు విస్తరింప చేసుకుంటున్నారనే ప్రచారం నెలకొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement