కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డినే మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ తమ అభ్యర్థిగా ఖరారు చేసింది. ఈయనే బీజేపీ అభ్యర్థి అని మొదటి నుంచి ప్రచారం జరుగుతున్నప్పటికీ శనివారం పార్టీ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ వేసే సమయంలో పార్టీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరుకానున్నారు. బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో దిగనున్నారు. గతంలో కూడా వీరు పోటీ చేసిన వ్యక్తులు కావడం విషేశం. ఈ ముగ్గురు పాత ప్రత్యర్థులే మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగడంతో మునుగోడు బైపోల్ వార్ మరింత ఆసక్తికరంగా మారింది. నవంబర్ 3న ఉపఎన్నిక జరగనుంది. ఉపఎన్నిక కౌంటింగ్ నవంబర్ 6న జరగనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement