Saturday, June 29, 2024

IND vs AUS | ఉత్కంఠ మ్యాచ్‌.. ఆసీస్‌పై టీమిండియా సూపర్ విక్టరీ…

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ ఉత్కంఠ మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో విజయం సాధించి…. అజేయంగా సెమీఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ ఆసీస్ బౌల‌ర్ల‌ను ఉతికారేస్తూ.. 205 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

- Advertisement -

అనంతరం చేజింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను 181 పరుగులకే కట్టడి చేసి ఆఖరి సూపర్ 8 మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. భార‌త్ నిర్దేశించిన 206 పరుగుల భారీ ఛేద‌న‌లో ఆసీస్‌కు ఆదిలోనే షాక్. ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ (6)ను అర్ష్‌దీప్ సింగ్ (3/37) వెన‌క్కి పంపాడు. ఆ తరువాత కుల్దీప్ యాదవ్ (2/24) 9వ ఓవర్లో కెప్టెన్ మిచెల్ మార్ష్ (37), 14వ ఓవర్లో తొలి బంతికి ప్రమాదకరంగా మారుతున్న మ్యాక్స్‌వెల్ (20) వెనక్కిపంపాడు.

అక్షర్ పటేల్ (1/21) వేసిన 15వ ఓవర్ తొలి బంతికి స్టోయినిస్ (2) డగౌట్ కు చేరుకున్నాడు. ఆసీస్‌కు 24 బంతుల్లో 58 పరుగులు కావాల్సిన సమయంలో 17వ ఓవర్‌లో ఆది నుంచి విజృంభిస్తున్న ట్రావిస్ హెడ్ (76)ను బుమ్రా (1/29) అవుట్ చేశాడు. ఇక 18వ ఓవర్లో మాథివ్ వేడ్ (1)ను అర్షదీప్ పెవిలియన్ చేర్చాడు. చివరకు పాట్ కమిన్స్ (11), మిచెల్ స్టార్క్ (4) నాటౌట్‌గా నిలిచారు. దీంతో ఆసీస్‌పై భారత్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది.

శివాలెత్తిన హిట్ మ్యాన్..

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో చివ‌రి సూప‌ర్ 8 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (92) శివాలెత్తిపోయాడు. ఆస్ట్రేలియా బౌలర్ల‌ను ఊచ‌కోత కోశాడు. ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో రికార్డు బ్రేక్ చేసిన‌ హిట్‌మ్యాన్ ఔట‌య్యాక సూర్య‌కుమార్ యాద‌వ్(31), వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(27 నాటౌట్)లు మెరుపు బ్యాటింగ్‌తో అల‌రించారు. దాంతో, టీమిండియా నిర్ణీత ఓవ‌ర్లలో 5 వికెట్ల న‌ష్టానికి 205 ర‌న్స్ కొట్టి ఈ సీజ‌న్‌లో భారీ స్కోర్ న‌మోదు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement