Tuesday, November 26, 2024

సైన్యానికి డేగ సాయం.. డ్రోన్‌ల‌ను కూల్చేయ‌డానికి హెల్ప్ చేస్తున్న ప‌క్షులు

శత్రు దేశాల డ్రోన్‌లను కూల్చివేయడానికి మన సైనికులు పక్షుల సాయం తీసుకుంటున్నారు. సరిహద్దు వెంట శత్రు దేశాల డ్రోన్‌లను కూల్చేయడానికి అర్జున్‌ అనే డేగకు శిక్షణ ఇచ్చారు. ఒక సైనికుడు అర్జున్‌కు చేతిలో పట్టుకున్న ఫొటో ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతోంది. పంజాబ్‌, జమ్ము-కాశ్మీర్‌ సరిహద్దులో డ్రోన్‌లను గుర్తించేందుకు భారత సైన్యం ఈ డేగను ఉపయోగిస్తోంది. ఈ ప్రాంతాల్లో పాక్‌ డ్రోన్ల తాకిడి ఎక్కువ. ఈమధ్య పాకిస్థాన్‌ నుంచి కొందరు డ్రోన్‌ల ద్వారా జమ్ము- కాశ్మీర్‌, పంజాబ్‌ సరిహద్దు ప్రాంతాలకు డ్రగ్స్‌, తుపాకులు, డబ్బుల్ని చేరవేస్తున్నారు.

దాంతో, పాక్‌ నుంచి వచ్చే డ్రోన్‌లను కూల్చడంలో అర్జున్‌, డాగ్‌ స్వ్కాడ్‌ భారత సైన్యానికి సాయపడుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని ఔలీలో భారతదేశం, అమెరికా సైన్యాలు సంయుక్తంగా నిర్వీహిస్తున్న యుధ్‌ అభ్యాస్‌లో అర్జున్‌, ఒక శునకం కలిసి డ్రోన్‌ ఉన్న ప్రాంతాన్ని గుర్తించాయి. 15 రోజుల పాటు జరగనున్న ఈ సైనిక విన్యాసాల్లో అమెరికా రెండో బ్రిగేడ్‌, మనదేశం నుంచి అస్సాం బ్రిగేడ్‌ సైనికులు పాల్గొంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement