దేశంలోని మహిళలు ఎనిమిది అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ విజ్ఞప్తి చేశారు. రష్యాలో జననాల సంఖ్య రోజురోజుకు పడిపోతుండడంతో ఆ దేశ కొత్త సలహా ఇచ్చారు.
మాస్కోలో జరిగిన వరల్డ్ రష్యన్ పీపుల్స్ కౌన్సిల్లో పుతిన్ వర్చువల్గా పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో రష్యాలో జనాభా పెంచడమే తమ ప్రధాన లక్ష్యంగా పుతిన్ వెల్లడించారు. ‘దేశంలోని చాలా మంది జాతుల ప్రజలు నలుగురు, ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది పిల్లల్నికంటూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థని కాపాడుకుంటూ వస్తున్నారని చెప్పారు. మన పాతతరం ఒక్కొక్కరు ఏడు, ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలనుకన్నారని, ఆ అద్భుతమైన సంప్రదాయాలను మనమూ కాపాడుకుందామని పుతిన్ ఆ దేశ మహిళలకు పిలుపునిచ్చారు.