హైదరాబాద్ ఆంధ్రప్రభ: తెలంగాణ ఈ-సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జులై 13న ఈ-సెట్ ప్రవేశ పరీక్ష తేదీని ఇప్పటికే ప్రకటించిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఈమేరకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి జూన్ 8 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అపరాధ రుసుము రూ.500తో జూన్ 14 వరకు, రూ.2500 అపరాధ రుసుముతో జులై 6 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. జులై 8 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈసీఈ, ఈఐఈ, సీఎస్‌ఈ, ఈఈఈ స్ట్రీమ్‌లకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగుతుంది.
సీఐవీ, సీహెచ్‌ఈఎం, ఎంఈసీ, ఎంఐఎన్, ఎంఈటీ, పీహెచ్‌ఎం, బీఎస్‌ఎం విభాగాలకు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.400, ఇతర అభ్యర్థులకు రూ.800గా నిర్ణయించినట్లు టీఎస్ ఈసెట్ కన్వీనర్ డాక్టర్ కె. విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ ఈ పీరక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్షను నిర్వహించడం జేఎన్‌టీయూహెచ్‌కి ఇది రెండో సారి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..