Sunday, October 6, 2024

Delhi – బంగ్లా దేశీయుల‌కు ఇక మెడిక‌ల్ ఈ వీసాలు… మోదీ

ఢిల్లీ – రెండు రోజుల భారత్‌ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా తో నేడు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విదేశీ నేతలతో మోదీ భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో ఇరుదేశాల ప్రధానులు లక నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్‌ నుంచి చికిత్స కోసం భారత్‌కు రావాలనుకునే వారికి ఇకపై ఈ-వీసా సదుపాయాన్ని కల్పించనున్నారు. దీనికోసం రంగ్‌పుర్‌లో కొత్తగా అసిస్టెంట్‌ హై కమిషన్‌ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నట్లు మోదీ తెలిపారు. బంగ్లాదేశ్‌లోని వాయవ్య ప్రాంత ప్రజలు సులువుగా భారత్‌కు వచ్చి చికిత్స పొందే వీలుంటుందని చెప్పారు. బంగ్లాదేశ్‌తో సంబంధాలకే భారత్‌ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు.

ఇరుదేశాల మ‌ధ్య ర‌క్ష‌ణ స‌హ‌కారం..

దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే దిశగా ముందుకు వెళ్తున్నట్లు మోదీ వెల్లడించారు. ఇరుదేశాల రక్షణ సహకారం, సాయుధ బలగాల ఆధునీకరణ తదితర అంశాలపై విస్త్రృతంగా చర్చించారు. బంగ్లాదేశ్‌- భారత్ సరిహద్దులో ఉగ్ర కార్యకలపాలను అడ్డుకోవడంతోపాటు శాంతిస్థాపనకు కృషి చేయాలని ఇరుదేశాలు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ రెండు దేశాల మద్య 4096.7 కిలోమీటర్ల సరిహద్దు ఉంద‌న్నారు. భారత్‌కు పొరుగుదేశాలతో ఉన్న సరిహద్దులో ఇదే పెద్దదిగా పేర్కొన్నారు. ‘ఇండియన్‌ ఓషన్‌ రీజియన్‌’ అంశంలోనూ భారత్‌కు తోడుగా నిలిచేందుకు బంగ్లాదేశ్‌ ముందుకు రావడాన్ని మోదీ స్వాగతించారు. ‘బే ఆఫ్‌ బెంగాల్‌ ఇనిషియేటివ్‌ ఫర్‌ మల్టీ సెక్టోరల్‌ టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ కోపరేషన్ తోపాటు ఇతర అంతర్జాతీయ ఫోరమ్‌ల విషయంలోనూ ఇదే సహకారాన్ని కొనసాగిస్తామన్నారు.

- Advertisement -

ఇరుదేశాల మధ్య వాణిజ్య, సహకార సంబంధాల బలోపేతానికి కృషి చేస్తామని మోదీ తెలిపారు. ”గత 10 ఏళ్లలో మేం ఇరుదేశాల మధ్య 1965 నాటికి ముందున్న సంబంధాలను పునరుద్ధరించాం. ఇకపై డిజిటల్‌, ఎనర్జీ కనెక్టివిటీపై దుష్టి పెడతాం. తద్వారా ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు పటిష్ఠమవుతాయి” అని మోదీ అన్నారు. మొత్తం 54 నదులు భారత్‌, బంగ్లాదేశ్‌ మీదుగా ప్రవహిస్తున్నట్లు గుర్తు చేసిన ప్రధాని.. వరదల నిర్వహణ, ముందస్తు హెచ్చరికలు, తాగునీటి ప్రాజెక్టుల విషయంలో పరస్పరం సహకరించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 1996 నాటి గంగా జలాల ఒప్పందాన్నే అనుసరిస్తున్నామని, దీనిలో కొన్ని మార్పులు చేయాలని తాజా సమావేశంలో నిర్ణయించామన్నారు. దీని కోసం భారత్‌ నుంచి ఓ సాంకేతిక బృందం త్వరలోనే బంగ్లాదేశ్‌కు వెళ్లి అక్కడి అధికారులతో చర్చలు జరుపుతుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement