రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ప్రస్తుత గడువు జనవరి 31తో ముగియనుంది. అనేక రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డులను ఆధార్ సంఖ్యతో అనుసంధానించే గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు కేంద్రం పెంచింది.
తెలంగాణలో రేషన్ కార్డుల ఈ-కేవైసీ 75.76 శాతం పూర్తయింది. ఫిబ్రవరి నెలాఖరుకల్లా 100 శాతం పూర్తి చేయాలని పౌర సరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్‌ను ఆదేశించారు.