హైదరాబాద్, ఆంధ్రప్రభ: మెట్రో రైల్ యాజ మాన్యం ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తోంది. నగరంలోని మూడు మార్గాల్లో సేవలందిస్తున్న మెట్రో రైల్ సరీసులు కోవిడ్ కాలంలో కునారిల్లినప్పటికీ ఆ తరాత క్రమ క్రమంగా గాడిన పడుతోంది. గడచిన రెండు, మూడు మాసాలుగా మెట్రో రైళ్ళన్నీ ప్రయాణి కులతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రయాణీ కులకు మరింత సేవలు అందించేందుకు హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారులు సిద్ధమ య్యారు. మెట్రో రైలు దిగగానే ప్రయాణీకులు గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఎలక్ట్రిక్ ఆటోలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇవి అందు బాటులోకి వస్తే మెట్రోరైలు దిగగానే గమ్యస్థానం చేరుకునేందుకు ప్రయాణికులు ఇకపై ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. స్టేషన్ పైనుంచి కిందికి దిగగానే ఎలక్ట్రిక్ ఆటోలు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేకంగా మెట్రో స్టేషన్లే కేంద్రంగా ఈ ఆటోలు తిరగనున్నాయి. దిల్లి, బెంగళూరులో ఈ తరహా సేవలు విజయవంతంగా అందిస్తున్న ఎలక్ట్రికల్ మొబిలిటీ అంకుర సంస్థ మెట్రో రైడ్ ఇప్పుడు హైదరా బాద్‌కు వచ్చింది. సోమవారం నుంచి ఈ – ఆటో సేవలు అధికారికంగా ప్రారం భం కానున్నాయి. ఈ – ఆటో కావాలనుకున్న ప్రయాణికులు మెట్రోరైడ్ యాప్ ద్వారా ఆటోలను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సంస్థ బెంగళూరులో గతేడా ది ప్రారం భించినప్పుడు తొలుత కిలోమీటర్‌కి రూ.10, తర్వాత కి.మీకు రూ.5 చొప్పున వసూలు చేశారు హైదరాబాద్ లోనూ ఛార్జీలు కూడా ఇందుకు అనుగు ణంగానే ఉంటాయని తెలుస్తోంది.
ఏ రూట్లో ఎన్ని ఆటోలు, ఎంత మేర చార్జీ లను వసూలు చేయాలన్న అంశంపై మెట్రో యాజమాన్యంతో మెట్రో రైడ్ సంస్థ చర్చిస్తోంది. ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్న ఈ ఆటోలకు ప్రయాణికుల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందన్నది అధ్యయనం చేసిన తర్వాత చార్జీలపై కొంత స్పష్టత రావచ్చని తెలుస్తోంది. మె ట్రో రైడ్ యాప్ నుంచి మెట్రో టిక్కెట్లు కూడా బుక్ చేసుకునేందుకు వీలుంటుంది. పూర్తిగా ఎలక్ట్రిక్ ఆటోలేకావడం, బుక్ చేసుకున్న ఐదు నిమిషాల్లోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడంతో వీటికి ఆదరణ మెరుగ్గా ఉంటుందని మెట్రో అధికారులు భావిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..