న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రేపటి (మంగళవారం) నుంచి బొగ్గు గనుల ఈ-వేలం ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. కేంద్ర బొగ్గు శాఖ ఇప్పటికే గనుల వేలంలో పాల్గొనే అర్హత కల్గిన సంస్థలను ఎంపిక చేసింది. నేడు (మంగళవారం) 8 బొగ్గు గనులు, బుధవారం మరో 2 బొగ్గు గనులను ఈ-వేలం వేయనున్నట్టు బొగ్గు శాఖ ప్రకటించింది. మొత్తం ఈ 10 బొగ్గు గనుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 39.31 మిలియన్ టన్నులుగా కేంద్రం పేర్కొంది. ఇప్పటి వరకు 85.54 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 43 బొగ్గు గనులను విజయవంతంగా వేలం నిర్వహించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.
Delhi: రేపటి నుంచి బొగ్గు గనుల ఈ-వేలం.. రెండ్రోజుల్లో 10 గనుల వేలం నిర్వహించనున్న కేంద్రం
Advertisement
తాజా వార్తలు
Advertisement