శ్రీకాంత్ ఓదెలా దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిన సినిమా దసరా.. మార్చి 30న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతుంది. కాగా తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. దసరా మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.యూ/ఏ సర్టిఫికేట్ను జారీ చేసింది. సెన్సార్ దసరాకు రెండు గంటల ఇరవైతొమ్మిది నిమిషాల రన్టైమ్తో ఈ సినిమా ప్రదర్శితం కానుంది. రన్ టైమ్ సినిమాకు కలిసొచ్చేలానే ఉంది.
ఇప్పడున్న సమయంలో ఎంత కంటెంట్ ఉన్న సినిమా అయినా ఎక్కువ నిడివి ఉంటే ప్రేక్షకులు బోర్గా ఫీలవుతున్నారు. సినిమా మొత్తంలో రెండు, మూడు సీన్లు బోర్ కొట్టిచ్చినా సరే.. ఆ ఎఫెక్ట్ సినిమాపై పడే అవకాశం ఉంది. అది సినిమాపై చాలా ప్రభావం చూపించింది. ఇప్పుడు ఆదే తప్పు జరగకుండా దసరా విషయంలో మేకర్స్ కత్తెరకు పనిచెప్పినట్లు తెలుస్తుంది. మరి నానికి ఈ చిత్రం ఎంతవరకు విజయాన్ని అందిస్తుందో చూడాలి.