Saturday, November 23, 2024

దసరా బొనాంజా

-ఇంటింటికి కిలో మాంసం.. ఫుల్‌ బాటిల్‌

-కానుకలు అందించేందుకు సిద్ధమైన ప్రధాన పార్టీలు
– ఏరులై పారుతున్న మద్యం – జోరుగా నగదు పంపిణీ – దసరాను అస్త్రంగా మార్చుకున్న నాయకులు
– నిఘా ఉన్నా ఆగని పంపకాలు – రూ.కోటి 45లక్షలకు పైగా నగదు, మద్యం స్వాధీనం – పెరిగిన మాంసం అమ్మకాలు
-పండుగకు యాట కొందామంటే దొరకని పరిస్థితి

(ప్రభన్యూస్‌ బ్యూరో
ఉమ్మడి కరీంనగర్‌) :
హుజూరాబాద్‌లో మద్యం ఏరులై పారు తోంది. నగదు పంపిణీ జోరుగా సాగు తోంది. ఎన్నికల కమిషన్‌ నిఘా వేసినా దొడ్డిదారిన చేర్చుతున్నారు. హుజూరా బాద్‌ చుట్టూ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసిన ప్పటికీ తనిఖీలు నామమాత్రంగా ఉండ టంతో ఓటర్లను ప్రలోభపరిచేందుకు దసరాను అస్త్రంగామార్చుకున్నారు నాయకులు. ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి బుధవారం వర కు కోటి 45 లక్షల 20వేల 727 రూపాయ ల నగదును స్వాధీనం చేసుకున్నారు. లక్షా 50వేలు విలువగల 30 గ్రాముల బంగారం, 5,11,652 రూపాయల విలు వగల 867 లీటర్ల మద్యాన్ని, 2,21,000 విలువగల చీరలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లను ప్రలోభపరిచేందుకు ఏవిధంగా ఎత్తులు వేస్తున్నారో అర్థం అవుతుంది. ఉప్పల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన అధికార టీఆర్‌ఎస్‌ , బీజేపీల మధ్య మాటల యు ద్ధానికి దారితీసింది. రోడ్డు ప్రమాదానికి కారణం మద్యంసేవించి వాహనం నడపడమేనని ఈ మద్యాన్ని టీఆర్‌ఎస్‌ వారు సరఫరా చేస్తున్నారని, కాదు కాదు ఈటల రాజేందర్‌ నీచ రాజకీయం చేస్తు న్నాడని, ప్రమాదానికి కారణం బీజేపీ వారని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అనుచరుడి వాహనం ఢీ కొని వ్యక్తి మృతి చెందాడని పరస్పర ఆరో పణలు, ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదులు, కేసుల నమోదు వరకు వెళ్లాయంటే ఎన్ని కల నాటికి ఇంకెన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయో చూడాలి. శుక్రవారం దసరా పండుగ కావడంతో హుజూరా బాద్‌ మద్యం మత్తులో చిక్కుకునే ప్రమా దం ఏర్పడింది. గొర్రెలు కావాలంటూ హుజురాబాద్‌ మాంసం విక్రయదారులు ఉమ్మడి జిల్లాలోని అంగడీలను చుట్టి వస్తున్నారు. దొరికినవి దొరికిన కాడికి కొనుక్కొని తరలిస్తున్నారు. దసరా పం డుగ కు అమ్మకాలు ఎక్కడయినా ఎక్కువ నే ఉంటాయి కాని హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక రావడంతో మాంసం అమ్మకాలు పెరిగి దసరా సమయానికి దొరకని పరి స్థితులు నెలకొన్నాయి. కొందరు గొర్ల కాపరులు, మాంసం విక్రయదారులు పక్క జిల్లాల నుంచి ఇక్కడికి తీసుకువ చ్చారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ అసెంబ్లిస నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే దసరాకు యాట ను కొందామంటే దొరకని పరిస్థితి ఉంది. ఇక్కడ రోజు దసరానే నడుస్తున్నా పెద్ద దసరా ఈనెల 15న ఉంది. దసరా సెలవులకు ఈసారి బంధువులు తమ ఇంటికి రావాలని హుజూరాబాద్‌ నియో జకవర్గం వారు బంధువులను ఆహ్వాని స్తున్నారు. అయితే ఇంట్లో యాట కోసు కోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. గొర్రె (కోయంది) కిలో 350 నుంచి 400 పలుకుంది. ఇక్కడ ప్రధాన పోటీ దారులు, వారి తరపున పార్టీలు మాత్రం దసరా రోజు ఇంటికి కిలో మాసం, ఒక ఫుల్‌ బాటిల్‌ ను అందించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆయా గ్రామాల్లో మద్యం నిల్వలు ఉంచి నట్లు తెలిసింది. ప్రతి వందమందికి ఒకరిని ఇన్‌చార్జీగా ఒకరిని ఒక పార్టీ ఉంచితే, ప్రతి 50 మందికి ఒకరిని ఇన్‌చార్జీగా ఒక పార్టీ వారు నియమించా రు. ఆయా మండల పట్టణ ఇన్‌చార్జీల ద్వారా బూత్‌ స్థాయిలో ఉన్న ఇన్‌చార్జీలు దసరా కానుకలను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. బతుకమ్మ పర్వదినం ఈసారి బుధ, గురు వారాలు రెండు రోజుల పాటు ప్రాంతానికోతీరున నిర్వ హించుకోవాలని చూస్తుండటంతో ఈ రెండురోజులు గౌరమ్మ పూజ ఉంటుంది కనుక నాన్‌ వెజ్‌ కు దూరంగా ఉంటారు. అందుకే దసరా రోజు యాళ్లపొద్దున ఇం టింటికి మందు బాటిల్‌, కిలో మాంసం ప్యాకెట్‌ ఏర్పాట్లు చేసి నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌ పార్టీ వారు ప్రతి 50 మంది ఓటర్లకు, బీజేపీ వారు ప్రతి వంద మంది ఓటర్లకు ఒకరిని ఇన్‌ చార్జీగా నియమించింది. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోని కార్పొరేటర్‌, కౌన్సి లర్‌, సర్పంచ్‌, జడ్పీటీసీ స్థాయి నుంచి సర్పంచ్‌ స్థాయి నేతలకు ఇక్కడ డ్యూటీ లు వేశారు. సిద్దిపేట నుంచి కూడా మం త్రి హరీష్‌రావు తన టీంను దించారు. బీజేపీకి చెందిన కార్యకర్తలు, నేతలు కూడా హుజూరాబాద్‌ నియోజకవర్గం లో ప్రచారంలో మునిగితేలుతున్నారు. జూన్‌ నెల నుంచి ఇన్‌చార్జీలుగా మండ ల, వార్డు, గ్రామ స్థాయిలో ఉన్న ఇన్‌చార్జీ లు దసరా పండుగ రోజున ఉదయం తమ డ్యూటీలు ముగించుకొని మళ్లిస మరుసటి రోజు రావాలని ఆయా పార్టీల నేతలు ఆదేశించినట్లు తెలిసింది. హుజూ రాబాద్‌ నియోజకవర్గంలో మొత్తం 29 మద్యం దుకాణాలు ఉన్నాయి. హుజూ రాబాద్‌ పట్టణం, మండలంలో కలిపి 9 దుకాణాలు, వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంటలో కలిపి 15 దుకాణాలు, వరంగల్‌ జిల్లా పరిధిలో ఉన్న కమలా పూర్‌లో 5 మద్యం దుకాణాలు ఉన్నా యి. వీటి పరిధిలో గ్రామానికి ఒకటి రెండు బెల్ట్‌ షాపులు పనిచేస్తున్నాయి. మూడు నెలల నుంచి అమ్మకాలు పె రిగా యి. ఇక్కడ కొన్ని రకాల బ్రాండ్‌లు దొర కకపోతుండటంతో కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని వైన్స్‌ షాపుల పేరుతో డీడీ లు తీసి లిక్కర్‌ ను డంప్‌ చేసుకుంటూ సర ఫరా చేసేందుకు సిద్ధమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement