హైదరాబాద్, ఆంధ్రప్రభ : సింగరేణి సంస్థ కార్మికులకు లాబాల్లో వచ్చిన వాటాలో రూ. 711.18 కోట్లను దసరా బోనస్‌గా సింగరేణి సంస్థ ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గత ఏడాది సాధించిన రూ. 2,222.46 కోట్ల ఆదాయంలో 32 శాతాన్ని బోనసుగా దసరా పండుగకు వారం రోజుల ముందే చెల్లించనున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ తెలిపారు. ఒక్కో ఉద్యోగికి సగటున రూ.ఒక లక్ష 53 వేల వరకు లాభాల బోనస్ అందనుందని తెలిపారు.
దేశంలో మరే ఇతర బొగ్గు కంపెనీ లో లేని విధంగా సింగరేణి సంస్థ ప్రతి ఏడాది తనకు వచ్చిన నికర లాభాల్లో కొంత శాతం వాటాను లాభాల బోనస్ గా కార్మికులకు పంచడం జరుగుతుందని, ఇది ప్రత్యేక తెలంగాణ వచ్చాకనే కేసీఆర్ నిర్ణయం మేరకు అమలు జరుగుతోందని తెలిపారు.
2013 -14లో 20 శాతం ఉండగా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ పెంచార్నారు. 2014-15 లో 21 శాతం, 2015-16లో 23 శాతం ( రూ. 245.21 కోట్లు) , 2016-17లో 25 శాతం (రూ. 98.85 కోట్లు), 2017-18 లో27 శాతం (రూ.327.44 కోట్లు), 2018 19 లో 28 శాతం ( రూ.493.82 కోట్లు), 2020-21 లో29 శాతం (రూ.79.07 కోట్లు), 2021-22లో 30 శాతం (రూ.368.11 కోట్లు) ప్రకటించినట్లు తెలిపారు.
గత ఆర్థిక సంవత్సరం అనగా 2022-23 సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాలు రూ. 2, 222 కోట్ల రూపాయల లో 32 శాతం అనగా రూ.711.18 కోట్ల ను లాభాల బోనస్ గా కార్మికులకు చెల్లించాలని, అది కూడా దసగా పండుగకు మ ఉందే చెల్లించాలని సీఎం కేసీఆర్ ఇటీవలే ఆదేశించారని సీఎండీ శ్రీధర్ వివరించారు.
ప్రధానంగా ఎక్కువ హాజరు ఉన్నవారికి ఎక్కువ మొత్తంలో లాభాల బోనస్ దక్కనుందని, భూగర్భ గని ఉద్యోగులకు రోజుకు రూ. 749.58 చొప్పున వారు పని చేసిన మొత్తం దినాలకు లెక్కగట్టి లాభాల బోనస్ చెల్లిమని తెలిపారు. ఓపెన్ కాస్ట్ గనులు , ఇతర సర్ఫేస్ శాఖల్లో పనిచేసే వారికి రూ.627.41 చొప్పున చెల్లిస్తామని, మిగిలిన విభాగాలు, శాఖల్లో పనిచేసే వారికి రోజుకు రూ.578.69 ల చొప్పున వారు పనిచేసిన దినాలకు లెక్క కట్టి బోనస్ చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. సగటు-న ఒక్కో కార్మికునికి రూ 1,53,516 వరకు లాభాల బోనస్ పొందే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ వచ్చాకనే అత్యధిక టర్నోవర్, లాభాలు..
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు అందిస్తున్న సహకారం, సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం, ఉద్యోగుల సమిష్టి కృషితో సింగరేణి సంస్థ గత తొమ్మిదేళ్ల కాలంలో అద్భుతమైన ప్రగతిని సాధించిందని సీఎండీ శ్రీధర్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో లాభాల్లో 421 శాతం వృద్ధి, అమ్మ కాలలో 176 శాతం వృద్ధిని సాధించిందన్నారు. 2013-14 లో రూ.11,928 కోట్ల టర్నోవర్ ఉందని, గత తొమ్మిదేళ్లలో ప్రతి ఏటా వృద్ధి చెందుతూ 2022-23లో రూ.33,065 కోట్ల రూపాయల టర్నోవర్‌కు చేరిందన్నారు.
గతంలో రూ.419 కోట్ల లాభాలను సాధించిన సంస్థ ఇప్పుడు రూ.2222 కోట్ల రూపాయల లాభాలను సాధించిందని తెలిపారు. త్వరలోనే దీపావళి బోనస్ కూడా రూ. 300 కోట్ల వరకు ఉండొచ్చని, ఒక్కో కార్మికుడికి రూ. 76,500 కంటే ఎక్కువగానే పొందే అకాశం ఉంటుందన్నారు. అంతే కాకుండా ఇటీ-వలనే చెల్లించిన 11వ వేజ్ బోర్డు ఎరియర్స్ రూ. 1450 కోట్లలో సగటు-న ఒక్కో కార్మికునికి 3.65 లక్ష రూపాయల వరకు అందాయన్నారు.
దీంతో వేజ్ బోర్డు ఎరియర్స్, లాభాల బోనస్ , దీపావళి బోనస్ లు కలిపితే సగటు-న ప్రతి కార్మికుడి ఖాతాలో దాదాపు రూ. 6 లక్షల రూపాయల వరకు జమ అయ్యే అవకాశం ఉందని, ఒక ఏడాదిలో ఇంత పెద్ద మొత్తంలో తమ కష్టార్జితం చేతికందడం ఇదే ప్రథమం అని వివరించారు.
ఈ ఏడాదికి నిర్దేశించుకున్న వార్షిక ఉత్పత్తి లక్ష్యం 720 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణాను సాధించగలిగితే సింగరేణి సంస్థ గత ఏడాది కన్నా మిన్నగా రూ. 3500 కోట్ల లాభాలను సాధించే అవకాశం ఉందని, ఫలితంగా మరింత సంక్షేమం తో పాటు-. ఇప్పటికన్నా ఎక్కువ లాభాల వాటా బోనస్ ను పోందే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతి కార్మికుడు తన పనిగంటలను, యంత్రాల పనిగంటలను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ ఉత్పాదకత, ఉత్పత్తి పెంచాలని ఆయన పిలుపునిచ్చారు.