Saturday, November 23, 2024

జులై- సెప్టెంబర్‌ కాలంలో భారీగా పెరిగిన ఇళ్ల అమ్మకాలు

దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో జులై- సెప్టెంబర్‌ కాలంలో ఇళ్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే అమ్మకాలు 36 శాతం పెరిగినట్లు తెలిపింది. 2023 జులై- సెప్టెంబర్‌ కాలంలో మొత్తం 1,20,280 ఇళ్ల అమ్మకాలు జరిగాయని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టింగ్‌ సంస్థ అనరాక్‌ తన నివేదికలో వెల్లడించింది. సాధారణంగా వర్షాలు ఎక్కువగా కురిసే ఈ సీజన్‌లో ఇళ్ల అమ్మకాలు తక్కువగా ఉంటాయని, కాని ఈ సారి అందుకు భిన్నంగా రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు నమోదైనట్లు పేర్కొంది.

గత సంవత్సరం ఇదే కాలంలో 88,230 ఇళ్ల అమ్మకాలు జరిగాయి. ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో కూడా కాలంలో ఇళ్ల అమ్మకాలు 5 శాతం పెరిగి 1,15,100 యూనిట్లుగా నమోదైనట్లు తెలిపింది. ప్రధానమైన ఏడు నగరాల్లో ఇళ్ల సగటు ధరల్లో 11 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. హైదరాబాద్‌లో అత్యధికంగా ఇళ్ల ధరలు 18 శాతం పెరిగాయని అనరాక్‌ తెలిపింది. ఇళ్లకు అత్యధిక డిమాండ్‌ ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌) ప్రాంతం నుంచి వచ్చినట్లు తెలిపింది.

- Advertisement -

ఈ ప్రాంతంలో మొత్తం 38,500 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరం ఇదే కాలంలో 26,400 యూనిట్ల అమ్మకాలు మాత్రమే నమోదయ్యాయి. ముంబై తరువాత పుణేలో 22,885 యూనిట్లు, బెంగళూర్‌లో 16,395 యూనిట్లు అమ్మకాలు జరిగాయి. అమ్మకాల విషయంలో పుణే గత సంవత్సరంతో పోల్చితే 63 శాతం పెరిగాయి. రెండో స్థానంలో బెంగళూర్‌లో అమ్మకాలు 29 శాతం పెరిగాయి.

మొత్తం ఏడు నగరాల్లో ఇళ్ల అమ్మకాల్లో ఒక్క ముంబై, పుణే వాటానే 51 శాతంగా ఉందని, వార్షిక అమ్మకాలు రీత్యా చూస్తే ముంబైలో 46 శాతం వృద్ధి నమోదు చేసినట్ల అనరాక్‌ ఛైర్మన్‌ అనూజ్‌ పూరీ తెలిపారు. వడ్డీరేట్లు ఇలానే స్థిరంగా ఉంటే రానున్న త్రైమాసికాల్లోనూ ఇళ్ల అమ్మకాలు పెరుగుతాయని ఆయన చెప్పారు. ఈ ఏడు నగరాల్లో ఈ త్రైమాసికంలో మొత్తం 1,16,220 కొత్త ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైనట్ల అనరాక్‌ తెలిపింది.

గత సంవత్సరం ఇదే కాలంలో 93,490 యూనిట్లతో పోల్చితే కొత్త వాటి లాంచింగ్‌ 24 శాతం పెరిగాయి. 40-80 లక్షల లోపు ఉన్న ఇళ్లకు డిమాండ్‌ అత్యధికంగా ఉంటోంది. వీటి అమ్మకాలు 28 శాతంగా ఉన్నాయని తెలిపింది. 80లక్షల నుంచి 1.5 కోట్ల లోపు ఎక్కువ విలువైన లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 27 శబుూతంగా ఉన్నాయి. ఈ ఏడు నగరాల్లో అతి పెద్ద రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు కొత్త ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తున్నట్లు అనరాక్‌ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement