Tuesday, November 26, 2024

బంగారు మాస్క్ తో దుర్గాదేవి దర్శనం..

గత ఏడాదిన్నర నుంచి కరోనా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది. మహామహులే కరోనా దాటికి బెంబేలెత్తిపోయారు. కరోనా కట్టడికి ఒకే ఒక్క మార్గం వ్యాక్సినేషన్..అసలు కరోనానే సోకకుండా ఉండాలంటే మాత్రం జాగ్రత్తలు తప్పనిసరి..అందులో మఖ్యంగా మాస్క్ ధరించడం..పదేపదే చేతులను శానిటైజరర్ తో కడుక్కోవడం..ఈ నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌ని స‌రిగా జాగ్ర‌త్తులు తీసుకొవాల్సిందే. మాస్క్ పెట్టుకోకుంటే జ‌రిమానాలు విధిస్తున్నారు. క‌రోనా ఎఫెక్ట్ మ‌నుషుల‌కే కాదు, దేవుళ్ల‌కు కూడా త‌గిలింది. థ‌ర్డ్‌వేవ్ ప్ర‌మాదం ముంచుకొచ్చే ప్ర‌మాదం ఉండ‌టంతో ఆల‌యాల్లోని దేవుళ్ల‌కు మాస్క్‌లు తొడుగుతున్నారు. బెంగాల్‌లో దుర్గాదేవిని కొలుస్తుంటారు. దుర్గాదేవి ప‌రాక్ర‌మానికి ప్ర‌తీక‌. ద‌స‌రా ఉత్స‌వాల కోసం ఇప్ప‌టి నుంచే విగ్ర‌హాల తయారీ అవుతున్నాయి. కోల్‌క‌తాలోని బిగుయాటీ మండ‌పంలో దుర్గామాత అమ్మ‌వారికి బంగారంతో చేసిన మాస్క్‌, చేతిలో శానిటైజ‌ర్‌, ఆక్సీమీట‌ర్‌, థెర్మోగ‌న్‌, సిరంజీ వంటివి ఉంచారు. క‌రోనా నుంచి కాపాడాల‌ని కోరుకుంటూ అమ్మ‌వారి విగ్ర‌హాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసిన‌ట్టు నిర్వాహ‌కులు చెబుతున్నారు. 2020లో లాక్‌డౌన్ స‌మ‌యంలో దేవాల‌యాలు మూసేశారు. సామాన్య‌భ‌క్తుల‌ను అనుమ‌తించ‌లేదు. శ్రీరామ న‌వ‌మి నుంచి దస‌రా వ‌ర‌కు అందరూ ఇంట్లోనే నిర్వ‌హించుకున్నారు. క‌నీసం ఈ ఎడాదైనా అలా జ‌ర‌గ‌కుండా ఉంటుందేమో అనుకుంటే, కాద‌ని అంటున్నారు నిపుణులు.

ఇది కూడా చదవండి: వైజాగ్ లో చికిత్స తీసుకుంటున్న మెగాస్టార్

Advertisement

తాజా వార్తలు

Advertisement