Tuesday, November 19, 2024

మార్కెట్లో డ్యూక్‌ థర్డ్‌ జెన్‌.. కుర్రకారుకు హాట్‌ ఫేవరెట్‌గా కొత్త‌ KTM 390

యూత్‌ ఫేవరెట్‌ బైక్‌ KTM 390 డ్యూక్‌ బైక్‌ను కేటీఎం సరికొత్త అప్‌డేట్‌లతో థర్డ్‌ జెన్‌ బైక్‌గా దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. 2013లో కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పిన ఈ ఆరెంజ్‌ మిస్సైల్‌.. మళ్లీ ఇప్పుడు మరిన్ని ఫీచర్లతో ముందుకు వచ్చింది. మరి ఈ KTM 390 Duke 2024 బైక్‌ ఫీచర్లు, ఇంజిన్‌ పనితీరు, డిజైన్‌ పూర్తి వివరాలను చూద్దాం..

డిజైన్‌..

కొత్త 2024 KTM 390 2024 డ్యూక్ డిజైన్‌ను పరిశీలిస్తే ముందు భాగంలో, కొత్త DRLలు స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్‌కు దూకుడును జోడిస్తాయి. ఇందులో 15-లీటర్ ఫ్యూయ‌ల్ ట్యాంక్‌తో అప్‌డేట్‌ చేశారు. డ్యూయల్ ఫ్యాన్‌లను కలిగి ఉండే కర్వ్డ్ రేడియేటర్ కొత్త ఇంజిన్‌ను చల్లబరుస్తుంది. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ సెటప్ నీట్‌గా కనిపిస్తుంది. ఇక‌ ఎప్పటిలాగే, కొత్త 2024 KTM 390 డ్యూక్ ఆరెంజ్ అల్లాయ్ వీల్స్ సెట్‌పై ప్రయాణిస్తుంది. ఇందులో ఇప్పుడు అడ్జెస్ట‌బుల్ సస్పెన్షన్‌ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది. మొత్తంమీద, కొత్త 2024 KTM 390 డ్యూక్ లుక్స్ పరంగా మునుపటి కంటే బోల్డ్‌గా ఉంది.

ఫీచర్లు..

2024 390 డ్యూక్ లో ప‌లు పలు ఫీచర్లను అప్‌డేట్ చేసింది కంపెనీ. నిర్మాణ నాణ్యత స్థాయిలు కూడా పెరిగాయి. ఇంజిన్‌: సరికొత్త 398.7cc లిక్విడ్-కూల్డ్ సింగిల్‌తో ఆధారితమైనది. 44.25 bhp వద్ద 39 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8,500 hp వద్ద 6,500rpm ను ప్రొడ్యూస్‌ చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేయబడి ఉంది.

- Advertisement -

2024 KTM 390 డ్యూక్‌లోని బ్రేక్ సెటప్‌లో నాలుగు-పిస్టన్ రేడియల్ ఫిక్స్‌డ్ కాలిపర్‌ల ద్వారా బిగించబడిన ముందు భాగంలో 320mm డిస్క్ ఉంది. వెనుక బ్రేక్ డ్యూయల్-పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్‌ల ద్వారా బిగించబడిన 240mm డిస్క్. బ్రేక్‌లు, వెనుక సెటప్‌ను స్విచ్ ఆఫ్ చేయడానికి అనుమతించే సూపర్‌మోటోతో డ్యూయల్-ఛానల్ ABS జతచేసి ఉంటుంది. మొత్తంమీద, కొత్త 2024 390 డ్యూక్ దాని ఓల్డ్‌ జైన్‌ బైక్‌ కంటే 4 కిలోలు తేలికైనది. 183mm వద్ద 32mm ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ను అందిస్తుంది. కొత్త డ్యూక్‌లో సీటు ఎత్తు కూడా 23 మి.మీ తగ్గి.. 800 మి.మీ ఉంది. కొత్త ఛాసిస్ సెటప్, స్టిక్కీ మెట్జెలర్ రబ్బర్‌తో పాటు కొత్త 2024 KTM 390 డ్యూక్ రైడ్ చేయడానికి సరదాగా ఉంటుంది.

చివరగా KTM 390 Duke బైక్‌ ఆకర్షణీయమైన డిజైన్‌, పవర్‌ఫుల్‌ ఇంజిన్‌తో ముందుకు వచ్చింది. ఈ ఆరెంజ్‌ మిస్సైల్‌ థర్డ్‌ జెన్‌లో మరిన్ని ఫీచర్లతో స్పోర్ట్‌ బైక్‌ రైడ్‌ చేయాలనే కుర్రకారుకు హాట్‌ ఫేవరెట్‌గా మారుతుందనడంలో సందేహం లేదు. రైడింగ్‌ స్టైల్‌కి సరిపోయే విధంగా సస్పెన్షన్‌ను సర్దుబాటు చేశారు. గుంతలు ఉన్న రోడ్లు, టర్నింగ్‌ల్లో కూడా మీరు సునాయాసంగా రైడ్‌ చేసేందుకు ఈ ఆరెంజ్‌ మిస్సైల్‌ సిద్ధంగా ఉంది. ధర రూ. 2.53 లక్షలు ఎక్స్‌-షో-రూమ్‌(ఢిల్లీ).

Advertisement

తాజా వార్తలు

Advertisement