Sunday, November 24, 2024

Nikhat Zareen కు డీఎస్పీ ఉద్యోగం..

భార‌త స్టార్ బాక్సర్, తెలంగాణ బిడ్డ‌ నిఖత్ జరీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం కల్పించింది. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన ఆమెకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో దీనికి సంబంధించిన నియామక పత్రాన్ని డీజీపీ జితేందర్ నిఖత్‌కు (బుధవారం) అందజేశారు. నిఖత్ జరీన్‌కు మూడేళ్ల పాటు ప్రొబెష‌న‌రీ ట్రైనింగ్‌ ఉంటుంది.

అయితే, నిజమాబాద్ ముద్దు బిడ్డ‌ నిఖత్ జ‌రీన్ కు గత ప్రభుత్వం భారీ నజారానతోపాటు, నివాస స్థలాన్ని కేటాయించిన సంగతి తెలిసిందే. అలాగే కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డును ప్రధానం చేయగా, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 కేడర్ ఉద్యోగం ఇచ్చింది.

కాగా, వరల్ట్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ వరుసగా రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. 2022, 2023 పోటీలో టైటిల్ అందుకుంది. అలాగే కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, ఏషియన్ గేమ్స్‌లో కాంస్య పతకాలు సాధించింది. అయితే, ఒలింపిక్స్ 2024 లో భారీ అంచ‌నాల‌తో బ‌రిలోకి దిగిన నిఖ‌త్ అనూహ్యంగా సెమీ ఫైనల్స్ కూడా చేర‌కుండానే నిష్ర్క‌మించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement