అమరావతిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్త నెలకొంది. 1998లో నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో క్వాలిఫై అయి, ఆపై పోస్ట్ లను పొందలేకపోయిన టీచర్ అభ్యర్థులు, తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 60 మంది ఉపాద్యాయులను అదుపులోకి తీసుకున్నారు.
తమ సమస్యల గురించి పాదయాత్రలో జగన్ తెలుసుకున్నారని, అధికారంలోకి వస్తే, తమకు పోస్ట్ లను ఇప్పిస్తానని ఆయన హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు. 22 సంవత్సరాలుగా అన్యాయం జరుగుతోందని ఆవేదని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పలు రకాల జీవోలు ఇచ్చి గందరగోళానికి గురి చేసి చేశారని తెలిపారు. జివో 221 వల్ల నష్టపోయాం అని చెప్పారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో గుర్తించిన 3,300 మంది అభ్యర్థులకు న్యాయం జరగలేదన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.