Monday, November 18, 2024

TG | మరోసారి మద్యం బంద్‌.. ఈనెల 4న డ్రైడే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హీట్‌ సమ్మర్‌ మందు బాబులకు మరింత వేడి పుట్టిస్తోంది. వరుస బందులతో మద్యం ప్రియులకు షాక్‌ తగులుతోంది. గత రెండు నెలలుగా పలు కారణాలతో మద్యం దుకాణాల మూసివేత కొనసాగుతోంది. ఈనెల 4న మరోసారి మద్యం దుకాణాల మూసివేతకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ప్రభుత్వం డ్రైడేను ప్రకటించింది.

ఏప్రిల్‌ నెల నుంచీ మద్యం దుకాణాల మూసివేతల పర్వం కొనసాగుతోంది. మే నెలలో కూడా కొనసాగింది. ఇప్పుడు జూన్‌లో కూడా మరోసారి మద్యం దుకాణాలు మూసేయబోతున్నారు. ఏప్రిల్‌ నెలలో రెండు రోజులపాటు మద్యం బందయింది. శ్రీరామ నవమి సందర్భంగా 17వ తేదీన హైదరాబాద్‌ జంటనగరాల్లో మద్యం షాపులు మూతపడ్డాయి.

శ్రీరాముడి శోభాయాత్ర నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 17న ఉదయం 6 గంటల నుండి 18వ తేదీ మార్నింగ్‌ 6 వరకు మద్యం షాపులు మూసి ఉంచారు. ఆ తర్వాత అదే నెల 23వ తేదీన హనుమాన్‌ జయంతి సందర్భంగా మరోసారి మద్యం దుకాణాలు మూసేశారు.

మే నెలలో నాలుగు రోజులు..

మే నెలలో ఏకంగా నాలుగు రోజులపాటు మద్యం దుకాణాలు మూతపడ్డాయి. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కారణంగా.. మే నెలలో 2 రోజులపాటు వైన్‌ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసేశారు. మే 12, 13 తేదీల్లో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఆ తర్వాత మే 27న నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కారణంగా మూసేశారు. మే 26, 27 తేదీల్లో 48 గంటలపాటు మూసేశారు.

- Advertisement -

జూన్‌ 4న మరోసారి…

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ తుది దశకు చేరుకుంది. శనివారం (జూన్‌ 1న) చివరి విడత పోలింగ్‌ ముగిసింది. పోలింగ్‌ ముగియడంతో.. అందరి దృష్టి కౌంటింగ్‌ మీద పడింది. జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తిచేసి, ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రోజున మరోసారి మద్యం దుకాణాలు మూసేయనున్నారు. సీఈవో వికాస్‌రాజ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఫలితాల తర్వాత ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు- తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement