Tuesday, November 26, 2024

మందు బాబులపై కొరడా, బ్రీత్ అనలైజర్ తో తనిఖీలు.. కేసులు నమోదు, వాహనాలు సీజ్

పాలకుర్తి, (ప్రభన్యూస్‌): మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు కొరఢా ఝుళిపించారు. ఆదివారం రాత్రి పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని టోల్‌ ప్లాజా వద్ద ఆకస్మికంగా బ్రీత్‌ అనలైజర్‌లతో ఐదు ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలను సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా సీఐ లు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాలతోపాటు జైలు శిక్ష తప్పదన్నారు.

మద్యం మత్తులో వాహనాలను నడపడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇందులో ఎంతో మంది మరణిస్తుండగా, క్షతగాత్రులు కూడా అవుతున్నారన్నారు. వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి వాహనాలను నడపొద్దన్నారు. పెద్దపల్లి సబ్‌ డివిజన్‌ పరిధిలో ప్రతినిత్యం బ్రీత్‌ అనలైజర్ల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. రవాణా శాఖ నిబంధనలు క‌చ్చితంగా పాటించాల్సిందేనన్నారు. ఆకస్మిక తనిఖీలలో ఎస్‌ఐలు మహేందర్‌, శివానీ, రవీందర్ లతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement