కోల్‌కతా పోర్టులో డీఆర్‌ఐ అధికారులు, గుజరాత్ యాంటీ-టెర్రర్ స్క్వాడ్ బృందం సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో 72 ప్యాకెట్లలో నిక్షిప్తం చేసిన 39.5 కేజీల హెరాయిన్ పట్టుబడింది. నిఘా వర్గాలు అందించిన పక్కా సమాచారంతో కంటైనర్‌లో తనిఖీలు చేయగా, గేర్ బాక్స్‌లో దాచిన హెరాయిన్ వెలుగుచూసింది.
దుబాయ్‌లోని జెబెల్‌కు చెందిన కంటైనర్, దాదాపు 9300 కేజీల బరువు. ఇందులో గేర్ బాక్స్‌లు ఉన్నట్లు గుర్తించారు. ఆ గేర్ బాక్సుల్లోనే 72 ప్యాకెట్లు బయటపడ్డాయి. వాటిని నిశితంగా పరిశీలించగా, హెరాయిన్ ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.