నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం రేపాయి. బంజారాహిల్స్ రోడ్.12లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ గురించి ముందస్తు సమాచారంతో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ అపార్ట్ మెంట్ లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 30 గ్రాముల కొకైన్, 6 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు ఎక్కడి నుంచి డ్రగ్స్ తెచ్చుకున్నారు, ఎవరు సరఫరా చేశారనే దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు నగరంలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్, నార్కోటిక్స్ విభాగం అధికారులు దాదాపు 40 బృందాలతో సోదాలు నిర్వహిస్తున్నారు.