Wednesday, November 20, 2024

Drugs Matter: షారుఖ్, అనన్య నివాసాల్లో ఎన్సీబీ రైడ్స్

డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్ ని కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులను నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు ఎంక్వైరీ చేశారు. తాజాగా హీరో షారుఖ్ ఖాన్‌ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఈ కేసులో అరెస్ట్ అయ్యి కోర్టు రిమాండ్ విధించ‌డంతో ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.

కాగా, తన కొడుకును ఓదార్చేందుకు షారుఖ్ గురువారం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు వెళ్లారు. మరోవైపు ఎన్సీబీ అధికారులు ఈరోజు షారుఖ్, హీరోయిన్ అనన్య పాండే నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. ఆర్యన్ ఒక యువ నటితో డ్రగ్స్ గురించి వాట్సాప్ లో చాట్ చేసిన‌ట్టు కోర్టుకు ఎన్సీబీ అధికారులు తెలిపారు. ఆ యువనటి అనన్య పాండే అని తెలుస్తోంది. మరోవైపు అనన్య ఫోన్ ను కూడా ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణకు హాజరు కావాల‌ని ఆమెను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement