Monday, November 25, 2024

Gujarat : విద్యార్ధుల లంచ్ బాక్స్ లో డ్ర‌గ్స్…

అవాక్కైన గుజ‌రాత్ పోలీసులు
పిల్ల‌ల బొమ్మ‌ల‌లో, చాక్లెట్స్ , క్యాండీల‌లో కూడా డ్ర‌గ్స్ ర‌వాణా
ఏకంగా కోటికి పైగా విలువైన డ్ర‌గ్స్ ప‌ట్టివేత
విదేశాల నుంచి వ‌స్తున్న‌ట్లు గుర్తింపు

డ్రగ్స్ను సరఫరా చేసేందుకు స్మగ్లర్లు వినూత్న రీతిలో ఆలోచిస్తున్నారు. ఈసారి స్మగర్లు చిన్న పిల్లల లంచ్ బాక్స్ లో డ్రగ్స్ ను సరఫరా చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ.. ఆ బాక్స్ కస్టమ్ అధికారుల కంటపడింది. అందులో ఏముందోనని తెరిచి చూడగా.. రూ.కోటి కంటే ఎక్కువ విలువ చేసే డ్రగ్స్ లభ్యమైంది.

అహ్మదాబాద్‌లో చిన్నారుల బొమ్మలు, చాక్లెట్లు, లంచ్ బాక్స్‌లు, క్యాండీ విటమిన్‌లలో దాచి ఉంచిన రూ. 1.15 కోట్ల విలువైన డ్రగ్స్‌ను శ‌నివారం ఉద‌యం స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఒక స్మగ్లర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్‌తో పాటు కస్టమ్స్, ఎక్సైజ్ విభాగాలు సంయుక్త ఆపరేషన్‌లో డ్రగ్స్ దందా బయటపడింది. కెనడా, యుఎస్ఏ, థాయ్‌లాండ్ నుండి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement