Tuesday, November 12, 2024

ఏపీలో డ్రగ్స్ మాఫియా.. వారే టార్గెట్!

ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ మాఫియా విస్తరిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ మత్తు దందాలో యువతతో పాటు విద్యార్థులు కూడా భాగమవుతోంది. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం రేగింది. తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా డ్రగ్స్ కల్చర్ విస్తరిస్తోంది. యూనివర్సిటీలు, కాలేజీలను డ్రగ్స్ మాఫియా టార్గెట్ చేశాయి. కొందరు గంజాయితో పాటు  సింథటిక్ డ్రగ్స్ వినియోగిస్తున్నారు. వీటిని విరివిగా డ్రగ్స్ మాఫియా విక్రయిస్తున్నాయి. మొట్టమొదటిసారిగా ఎండీఏంఏను ఎస్ఈసీ అధికారులు పట్టుకున్నారు. నెర్వస్ సిస్టం పై ఎండిఎంఏ అధిక ప్రభావం చూపుతుంది. ఇక వీటిని టాబ్లెట్ల రూపంలో తయారుచేసి సులభంగా రవాణా చేస్తున్నారు. మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో కొనుగోలు చేసి ఇక్కడ విక్రయిస్తున్న ముఠాను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే  ఇప్పటికే వీటిని విక్రయిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే వీటిపై పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించారు ఏపీ పోలీసులు.

ఏపీలో పలుచోట్ల ఇలాంటి మత్తు దందాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో దాడులు నిర్వహిస్తున్నా గంజాయి రవాణా మాత్రం జోరుగా సాగుతోంది. యువకులు, కాలేజీ విద్యార్థులే టార్గెట్ గా కొంతమంది అక్రమార్కులు ఈ మత్తు దందాను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ-గుంటూరు నగరాల మధ్య ఉన్న తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో యువకులు గంజాయికి బానిసలుగా మారుతున్న ఘటనలు గతంలో వెలుగుచూశాయి. అలాగే గంజాయి మత్తులో బ్లేడ్ బ్యాచ్ దాడులు కూడా జరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement