Saturday, November 23, 2024

పోలీసులకు దొరికిన మరో డ్రగ్స్‌ ముఠా.. ఢిల్లీ నుంచి సప్లయ్​ చేస్తున్నట్టు గుర్తింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లో డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్న ముగ్గురు నిందితులను నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ మండలం డీసీపీ జోయల్‌ డేవిస్‌ తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి డ్రగ్స్‌ పట్టుకున్న వైనాన్ని వివరించారు. పక్కా సమాచారంతో హైదరాబాద్‌ నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు చేసి నవనాథ్‌ అనుష్‌ (32), అబ్దుల్‌ నదీమ్‌ (29), ఖాజా ముబీనుద్దీన్‌ (23)లను అదుపులోకి తీసుకుని వారినుంచి రూ.3 లక్షల విలువైన 30 గ్రాముల ఎన్‌డీఎన్‌ఏ, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీరిని విచారించగా ఢిల్లిdలోని ఓ నైజీరియన్‌ నుంచి మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసి హైదరాబాద్‌లోని పలువురు వ్యక్తులకు రూ.6వేలకు ఒక గ్రామును విక్రయించే వారమని చెప్పారు. మహారాష్ట్ర నివాసి నవనాథ్‌ అనుష్‌, యూసుఫ్‌గూడ నివాసులు అబ్దుల్‌ నదీమ్‌, ఖాజా ముబీనుద్దీన్‌ గత కొంతకాలంగా ఈ వ్యాపారం చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారని వారికోసం గాలిస్తున్నామని చెప్పారు.

నవనార్‌ అను పుణలో ఉండి డ్రగ్స్‌ ఫెడ్లర్లను సంప్రదించి నగరంలో డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్టు చెప్పారు. పుణలో నవనార్‌తో సంబంధమున్న ఇద్దరు పరారిలో ఉన్నారని, హైదరబాద్‌లో నవనార్‌కు అబ్దుల్‌ ప్రధాన డ్రగ్స్‌ ఫెడ్లర్‌గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. వీరితో పాటు ఎనిమిది మంది కస్టమర్లను గుర్తించామని, వారిని కూడా అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. నవనాథ్‌ గత రెండేళ్లుగా పూణ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుతిరుగుతున్నాడని చెప్పారు. హైదరాబాద్‌ను మాదక ద్రవ్యాలరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని జోయల్‌ డేవిస్‌ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement