హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : రాజధాని హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాల రవాణా సరఫరా యథేచ్ఛగా సాగుతోంది. టాస్క్‌ఫోర్స్ ఆబ్కారీ నార్కోటిక్ విభాగం అధికారులు నిఘా పెట్టి ఈ అక్రమ దందాకు పాల్పడే వారిని పట్టుకుని కటకటాల వెనక్కు పంపిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. తాజాగా నగర శివార్లలోని సన్ సిటీ వద్ద ఓ విద్యార్థి డ్రగ్స్ తీసుకుంటుండగా నార్సింగి పోలీసులు ఆకస్మిక దాడి చేసి పట్టుకున్నారు. విద్యార్థి నుంచి 5 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్, 14 ఇన్సులిన్ సిరంజీలు ఓ వెయింగ్ మిషన్‌తో పాటు నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్‌తో పట్టుబడ్డ విద్యార్థి సాకేత్‌గా పోలీసులు గుర్తించారు. ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా జిల్లాలోని గన్నవరం ప్రాంతానికి చెందిన వారని పోలీసులు చెప్పారు. బెంగుళూరులో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్నారు. డ్రగ్స్‌ను రాజేంద్రనగర్ ప్రాంతంలో విక్రయించడానికి వచ్చి పోలీసులకు సాకేత్ చిక్కాడు. ఎన్డిdపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. డ్రగ్స్ ఎవరికి విక్రయించడానికి వచ్చాడు బెంగుళూరులో సాకేత్‌కు డ్రగ్స్ ఎవరు ఇచ్చారు అనే కోణంలో నార్సింగీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రంజీలు ఆడకండి..