Wednesday, November 20, 2024

పోలీసులు, మావోయిస్టుల మధ్య డ్రోన్ వార్

ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, మావోయిస్టుల మధ్య డ్రోన్ వార్ నడుస్తోంది. ఇరువర్గాలు ఆరోపణలు చేసుకుంటూ డ్రోన్ ఫొటోలు విడుదల చేస్తున్నారు. మొదట మావోయిస్టులు భద్రత దళాలపై డ్రోన్ ద్వారా దాడులు చేస్తున్నారని ఫొటోలు విడుదల చేసిన 48 గంటల్లో మావోలు పోలీసుల డ్రోన్‌లను తాము కూల్చి వేశామని ఫోటోలు విడుదల చేశారు. దీంతో ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో ఇప్పుడు కొత్త యుద్ధం మొదలైంది.

డ్రోన్ కెమెరాలతో పోలీసులు బాంబుల దాడికి పాల్పడటంపై భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దక్షిణ బ్యూరో స్పందించింది. ఈ మేర‌కు ఒక లేఖ‌ను, డ్రోన్ ఫోటోల‌ను విడుద‌ల చేసింది. మావోయిస్టులను హతమొందించేందుకు చేస్తున్న కుట్రలలో భాగంగా టెక్నాలజీని ఉపయోగించుకుని, డ్రోన్ కెమెరాలతో తమ కదలికలను తెలుసుకునే ప్రయత్నం చేయడంతో పాటు, మావోయిస్టులందరినీ మట్టుపెట్టేందుకు పోలీసులే డ్రోన్‌లతో బాంబుల దాడికి తెగబడ్డారంటూ ఆరోపించింది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చేసిన డ్రోన్ దాడులను బస్తర్ ఐజీ సుందర్ రాజ్ చేసిన ఆధారం లేని ఆరోపణలు ఖండించాలని లేఖలో కోరారు. డ్రోన్‌లతో బాంబుల దాడికి పాల్పడ్డ ఘటనపై మధ్యవర్తులను దాడి జరిగిన ప్రాంతానికి పంపి నిజానిజాలను నిగ్గు తేల్చి, అసలు వాస్తవ విషయాలను బయటకు తీసుకురావాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. కేంద్ర హోంశాఖ, మంత్రి ప్రధాన మంత్రి సలహాదారు విజయ్ కుమార్, ఆపరేషన్స్ డీజీపీ అశోక్ ఆపరేషన్ల పథకం ప్రకారమే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. డ్రోన్ల సహాయంతో దాడి జరిగిన ప్రాంతానికి విలేకరులు, ప్రజాస్వామికవాదులు వచ్చి పరిశీలించి వాస్తవ విషయాల్ని బాహ్య ప్రపంచానికి తెలుయజేయాలని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement