అమెరికా సైన్యం సిరియాలో ఇరాన్ అలైన్డ్ గ్రూపులకు వ్యతిరేకంగా పలు వైమానిక దాడులు చేసింది. ఒక అమెరికన్ కాంట్రాక్టర్ మరణించిన కొన్ని గంటల తర్వాత ఈ దాడులు జరిగాయి. గ్రూపులు చేసిన ఘోరమైన డ్రోన్ దాడిలో ఒక కాంట్రాక్టర్, ఐదుగురు యుఎస్ సైనికులు మరణించారు. మరొక ఒక కాంట్రాక్టర్ గాయపడ్డాడు. యుఎస్ సిబ్బందిపై దాడి, ప్రతీకారం రెండింటినీ పెంటగాన్ గురువారం ఆలస్యంగా వెల్లడించింది. ఈశాన్య సిరియాలోని హసాకా సమీపంలోని సంకీర్ణ స్థావరం వద్ద గురువారం మధ్యాహ్నాం 1.38 గంటలకు యుఎస్ సిబ్బందిపై దాడి జరిగిందని సైనికవర్గాలు తెలిపాయి. యుఎస్ ఇంటెలిజెన్స్ కమ్మూనిటీ వన్ వే అటాక్ డ్రోన్ దాడి వెనుక ఇరాన్ హస్తం ఉన్నట్టు యుఎస్ సైనిక వర్గాలు తెలిపాయి. ఇలాంటి చర్యలతో వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య ఇప్పటికే దెబ్బతిన్న సంబంధాలు మరింతగా ముదరినట్టు భావిస్తున్నారు.
అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ మాట్లాడుతూ, అధ్యక్షుడు జో బిడెన్ ఆదేశాల మేరకు ప్రతీకార దాడులు జరిగాయని, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌బీసీ) తో అనుబంధంగా ఉన్న గ్రూపులు దాడుల వెనుక ఉన్నట్టు సమాచారం అందిందన్నారు. ఈ దాడికి ప్రతిస్పందనగా ఐఆర్‌జీసీకి అనుబంధంగా ఉన్న సమూహాలచే సిరియాలో సంకీర్ణ దళాలపై ఇటీవలి వరుస దాడులకు ప్రతిస్పందనగా వైమానిక దాడులు నిర్వహింస్తామాని ఆస్టిన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇరాన్ సరిహద్దు ప్రాంతమైన సిరియాలో చమురు బావులున్న వ్యూహాత్మక ప్రావిన్స్ డియిర్ ఇజ్‌జోర్‌లో భారీ పేలుళ్లు జరుగుతున్నట్టు పలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రసారమవుతున్నాయి.
ఇది ఇరాన్ సరిహద్దు ప్రాంతం కూడా. ఇరాన్ మద్దతు ఉన్న మిలీషియా గ్రూపులు, సిరియన్ దళాలు ఈ ప్రాంతాన్ని నియంత్రిస్తున్నాయి. ఈ ప్రాంతాలపై ఇటీవల ఇజ్రెయిల్ వైమానిక దాడులు చేసింది. ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్, సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ ఆధ్వర్యంలో పని చేస్తుంది. ఇది విస్తృతంగా మధ్యప్రాచ్యం అంతటా బాంబులు మోసుకెళ్లే డ్రోన్‌లతో దాడుల చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. అయితే, ఇరాన్ మాత్రం డ్రోన్ దాడులకు సంబంధం లేదని ఖండిస్తుంది.