Friday, November 22, 2024

డ్రై ఫ్రూట్స్ ధరలు పెరగడానికి కారణం ఇదే

భారత్ లో గత రెండు మూడురోజుల క్రితం డ్రై ఫ్రూట్స్ ధరలు అమాంతం పెరిగాయి. అఫ్గాన్ తాలిబన్ల వశం కావడంతో భారత్ డ్రై ఫ్రూట్స్ ధరలు అమాంతం పెరిగాయి. భారత్-అఫ్గానిస్థాన్ మధ్య ఎగుమతులు, దిగుమతులను తాలిబన్లు నిలపివేశారు. అఫ్గాన్ లో పరిస్థితి ఇలాగేకొనసాగితే ధరలు మరింతగా పెరగనున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. భారత్- అఫ్గానిస్థాన్ మధ్య పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోంది. అందులో ముఖ్యంగా అఫ్గానిస్థాన్ నుంచి డ్రై ఫ్రూట్స్ భారత్ కు దిగుమతి అవుతాయి. దేశంలోని 85 శాతం డ్రై ఫ్రూట్స్ అఫ్గానిస్థాన్ నుంచే భారత్ కు వస్తాయి. ఇప్పుడు సడెన్ గా దిగుమతి ఆగిపోవడంతో ధరలకు రెక్కలొచ్చాయి. ఇక భారత్ నుంచి పంచదార, టీ, కాఫీ పొడి, దుస్తులు, ఫార్మాసూటికల్స్, ట్రాన్సిమిషన్ పవర్స్, చెర్రీ, పుచ్చకాయ, ఆరోగ్య మూలికలు ఎగుమతి అవుతాయి. ఉల్లిపాయలు, ఎండి ద్రాక్ష, గమ్ము, ఇంగువ, జీలకర్ర కూడా భారత్ కు అఫ్గానిస్థాన్ ఎగుమతి చేస్తోంది.

ఇది కూడా చదవండి: కేంద్రం అలా చేస్తే పెట్రోల్ రూ.32 కే వస్తుందట..

Advertisement

తాజా వార్తలు

Advertisement