పూరీ జగన్నాథ ఆలయంలో కొత్తగా డ్రెస్ కోడ్ అమలు చేస్తుంది. ఈ నిబంంధన కొత్త సంవత్సరం రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఒడిశాలోని పూరీ నగరంలోని ప్రఖ్యాత జగన్నాథ టెంపుల్ లోకి హాఫ్ ప్యాంట్, షార్ట్, రిప్డ్ జీన్స్, స్కర్ట్స్, స్లీవ్‌లెస్ డ్రెస్‌లు ధరించిన వారికి ప్రవేశం లేదని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు ఆలయంలోకి ప్రవేశించడానికి సంప్రదాయబద్దమైన దుస్తులు ధరించాలని అధికారులు కోరారు. కొత్త డ్రెస్ కోడ్ నియమం అమల్లోకి వచ్చిన తర్వాత పురుషులు ధోతీలు ధరించి 12వ శతాబ్దపు మందిరంలోకి ప్రవేశిస్తున్నారు.
ఇక, మహిళలు ఎక్కువగా చీరలు లేదా సల్వార్ కమీజ్‌లలో ఆలయానికి వస్తున్నారు. డ్రెస్ కోడ్‌పై భక్తులకు అవగాహన కల్పించాలని శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలనా విభాగం హోటళ్ల యజమానులకు తెలిపింది. పూరి ఆలయం లోపల గుట్కా, పాన్ నమలడంపై నిఘా విధించింది. అంతే కాకుండా ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని కూడా అధికారులు నిషేధించారు.