Saturday, November 23, 2024

లే ఆఫ్‌ ఉద్యోగులకు డ్రీమ్‌ 11 ఆఫర్‌.. అర్హ‌త‌కు త‌గ్గ‌ట్టు ఉంద‌నుకుంటే రావొచ్చు

అమెరికాకు చెందిన పెద్ద కంపెనీలైన ట్విటర్‌, మెటా పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు తొలగించాయి. యాపిల్‌, అమెజాన్‌, అల్పాబెట్‌ వంటి పెద్ద సంస్థల్లోనూ నియామకాలు తగ్గించాయి. లే ఆఫ్‌కు గురైన హెచ్‌1 బి వీసాదారులు 60 రోజుల్లోగా ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాల్సి ఉంటుంది. వారి ఇమ్మిగ్రేషన్‌ స్టేటస్‌ కొనసాగించాలంటే తప్పక ఉద్యోగం చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా లే ఆఫ్‌లో ఉద్యోగం కోల్పోయిన వారికి డ్రీమ్‌ 11 స హ వ్యవస్థాపకుడు హరీష్‌ జైన్‌ మంచి ఆఫర్‌ ఇచ్చారు.

అమెరికాలో ఈ ఏడాది టెక్‌ సంస్థల్లో 52 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అలాంటి వారిలో భారతీయులు ఉండే స్వదేశానికి తిరిగి రండీ, ముఖ్యంగా వీసా సమస్యలు ఉన్నవారు ఇక్కడికొచ్చి భారత్‌ టెక్‌ రంగం అభివృద్ధికి పాటు పడాలని ఆయన కోరారు. వచ్చే దశాబ్దంలో భారత్‌ టెక్‌ రంగంలో భారీ వృద్ధికి అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. డ్రీమ్‌ 11 సంస్థ ఆర్ధికంగా సుస్థిరంగా, లాభదాయకంగా ఉందని చెప్పారు. ఈ సంస్థలో ఉద్యోగం మీ అర్హతలకు తగినదని భావిస్తే సంకోచం లేకుండా సంప్రదించాలని హరీష్‌ జైన్‌ కోరారు.

డిజైనింగ్‌, ప్రొడక్ట్‌, టెక్‌ రంగాల్లో నైపుణ్యం ఉన్న వారి కోసం తాము ఎదురు చూస్తున్నామని ఆయన చెప్పారు. ఆన్‌లైన్‌లో క్రి కెట్‌ బెట్టింగ్‌ వేసే వారికి డ్రీమ్‌ 11 సుపరిచితమే. క్రికెట్‌, హాకీ, పుట్‌బాల్‌, బాస్కెట్‌ బాల్‌, వాలీబాల్‌ వంటి క్రీడలపై బెట్టింగ్‌ వేసేందుకు ఈ వేదిక వీలు కల్పిస్తోంది. 2008లో ప్రారంభమైన ఈ కంపెనీ 2019లో యూనికార్న్‌ కంపెనీగా అవతరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement