Tuesday, November 19, 2024

Delhi: రియల్ సూపర్‌హీరోగా డాక్టర్​ పిచ్చేశ్వర్ గద్దె.. ఐక్యరాజ్య సమితి హ్యుమానిటీ డే వేడుకల్లో సత్కారం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఐక్యరాజ్య సమితి మానవతా దినోత్సవం వేడుకల్లో ఈ ఏడాది ‘రియల్ సూపర్‌హీరో’ థీమ్ తీసుకోగా, భారత్ నుంచి ఎంపిక సూపర్‌హీరోలుగా ఎంపిక చేసిన 50 మందిలో తెలుగు వ్యక్తి డా. పిచ్చేశ్వర్ గద్దె ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో లింగాయాస్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ సంస్థకు ప్రెసిడెంగ్‌గా, సీఈఓగా పనిచేస్తున్న పిచ్చేశ్వర్ ఈ అరుదైన గుర్తింపు లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. మానవతా సహాయం కోసం కృషి చేస్తూ ఆదర్శప్రాయంగా నిలిచిన 50 మంది రియల్ సూపర్‌హీరోస్‌ను ఢిల్లీలో సత్కరించారు.

తమిళనాడు, అస్సాం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి ప్రజలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రిపబ్లిక్ ఆఫ్ కాంగో రాయబార కార్యాలయం మినిస్టర్ కౌన్సెలర్ సిరియాక్ గన్‌వాలా, కాన్సులర్ వ్యవహారాల మాజీ అధిపతి (డిప్లొమాట్- బుర్కినా ఫాసో) మిస్టర్ కొలిబ్లి డి. హెర్వే, జర్మనీ లెక్చరర్ జాస్మిన్ వాల్డ్‌మన్, గురుగ్రామ్ మేయర్ మధు ఆజాద్ హాజరయ్యారు. వీరి చేతుల మీదుగా డా. పిచ్చేశ్వర్ గద్దె ఈ సన్మానం పొందారు. అనంతరం పిచ్చేశ్వర్ మాట్లాడుతూ.. విద్యార్థుల కలలను నెరవేర్చడం కోసం తన ప్రయత్నం ఎప్పుడూ కొనసాగుతుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement