Saturday, November 23, 2024

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ ఇండిపెండెంట్ డైరెక్టర్ గా డా.పార్థసారథి నియామకం


కేంద్ర ప్రభుత్వం, రక్షణ శాఖ, ఉత్పత్తుల విభాగం కింద పనిచేసే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీలో ఇండిపెండెంట్ డైరెక్టర్ గా డా.పార్థసారథిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన ఈ పదవిలో మూడు సంవత్సరాల పాటు కొనసాగుతారు. దీనిపై భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ – డా. పార్థసారథికి ఉత్తరం రాశారు. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తరఫున ఆహ్వానిస్తున్నామని తెలిపారు. డైరెక్టర్ గా మీ నియామకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, మీ సలహాలు, సూచనలతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.

నియామకంపై డా. పార్థసారథి స్పందిస్తూ…త‌న పై నమ్మకం ఉంచి ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి, హోంమంత్రి అమిత్ షా కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. అలాగే రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కి, రాష్ట్ర ఇన్ ఛార్జిలు మురళీధరన్, సునీల్ దేవధర్ కు, జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి కి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ కి, సత్య కుమార్ కు, జీవీఎల్ నరసింహారావు కు, కన్నా లక్ష్మీనారాయణ కు, మధుకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. త‌నకు అప్పగించిన ఈ బాధ్యతలో అత్యంత నిబద్ధతతో పని చేస్తానన్నారు. భారత దేశీయ రక్షణరంగ ఉత్పత్తులను తయారు చేయడంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ చేస్తున్న విశేష కృషి లో తాను కూడా భాగస్వామి అవుతానన్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేస్తున్నానన్నారు. దేశ రక్షణ రంగానికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement