Saturday, November 16, 2024

TG | సాంస్కృతిక సారథి ఛైర్మన్‌గా గద్దర్ కూతురు

తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా గద్దర్ కుమార్తె డాక్టర్ గుమ్మడి వెన్నెలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సాంస్కృతిక కళాకారులకు గుర్తింపు, ఉపాధిని కల్పించేందుకు తెలంగాణ సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేశారు. ఇందులోని కళాకారులు కళాబృందాలుగా ఏర్పడి సామాజిక దురాచారాలు, మూఢనమ్మకాలపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.

- Advertisement -

అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను సాంస్కృతిక సారథి కళాకారులతో ప్రచారం చేయిస్తారు. కళా ప్రదర్శనలకు అనువైన శిక్షణనివ్వడానికి, వర్క్ షాపులు నిర్వహించడానికి సాంస్కృతిక సారథి సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తుంది. గ్రామ గ్రామాన అట్టడుగు స్థాయిలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేరేలా ఈ పథకం పనిచేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement