Tuesday, November 26, 2024

రెట్టింపైన స్విగ్గీ నష్టాలు..

ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ నష్టాలు రెట్టింపు అయ్యాయి. 2022 ఆర్ధిక సంవత్సరంలో సంస్థ నష్టాలు 3,629 కోట్లుగా నమోదైంది. క్రితం సంవత్సరం సంస్థ నష్టాలు 1,617 కోట్లుగా ఉన్నాయి. సిగ్గ్వీ మొత్తం ఖర్చలు 9,574 కోట్లుగా ఉన్నాయి. 2021 ఆర్ధిక సంవత్సరంలో సంస్థ ఆదాయం 2,547 కోట్ల నుంచి భారీగా పెరిగి 2022 ఆర్ధిక సంవత్సరంలో 5,705 కోట్లకు చేరింది. అవుట్‌ సోర్సింగ్‌ కాస్ట్‌ ఈ కాలంలో 24.5 శాతం పెరిగి, మొత్తం 2,350 కోట్లుగా ఉందని కంపెనీ తెలిపింది.

ఈ ఆర్ధిక సంవత్సరంలో సంస్థ వాణిజ్య ప్రకటనలు, ప్రమోషనల్‌ కార్యకలాపాలకు 1,848.7 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. భారీగా డిస్కౌంట్లు ఇచ్చినప్పటికీ స్విగ్గీ క్రమంగా మార్కెట్‌ షేర్‌ కోల్పోతూ వచ్చింది. ప్రధానంగా ప్రత్యర్ధి సంస్థ జొమాటో మార్కెట్‌ షేర్‌ పెరిగింది. సిగ్గ్వీ నష్టాలు భారీగా పెరగడంతో మరోసారి పెద్ద సంఖ్యలోఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement