న్యూఢిల్లిd : అసెంబ్లి ఎన్నికలవేళ యూపీ ప్రజలకు బీజేపీ వరాలు కురిపిస్తోంది. ఇప్పటి దాకా అభివృద్ధి నినాదాన్ని వినిపించిన కాషాయపార్టీ అసాధారణ హామీలతో ప్రజల్ని ఆకర్షిస్తోంది. ఘజియాబాద్‌లోని మోడీనగర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన హామీ ప్రకటించారు. బీజేపీ మళ్లి అధికారంలోకి వస్తే, ఉచిత డబుల్ డోస్ వ్యాక్సిన్ మాదిరిగానే, ప్రతినెలా ఉచిత డబుల్ రేషన్‌ను అందిస్తుందని చెప్పారు. గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామన్న సమాజ్‌వాది పార్టీ హామీని తోసిపుచ్చారు. 2017కు ముందు విద్యుత్ అందుబాటులో ఉందో లేదో మీరే వారిని (ఎస్‌పీ, బీఎస్‌పీని) అడగాలని ఆదిత్యనాథ్ సూచించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో 135 కోట్ల మంది ప్రజలు ఉచిత టీకా తీసుకున్నారని, ఉచితంగా కరోనా పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. బీజేపీ వ్యాక్సిన్ అంటూ మిమ్మల్ని టీకాలకు దూరం చేయాలని చూశారు.
వ్యాక్సిన్లపై తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా.. అది బీజేపీ వ్యాక్సిన్ కాబట్టి.. ఓటు కూడా బీజేపీకే వేయండి అని కోరారు. 30 వేల కోట్లతో రక్షణ కారిడార్, ఢిల్లి-మీరట్ ర్యాపిడ్ రైల్ కారిడార్
నిర్మించబడిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వం శ్మశాన వాటికల ప్రహరీ గోడలు నిర్మించడానికే డబ్బు ఖ
ర్చుచేసిందని, తమ ప్రభుత్వం తీర్థయాత్ర కేంద్రాలు, దేవాలయాల అభివృద్ధికి కృషి చేసిందని చెప్పారు.
బీజేపీ మాత్రమే రాష్ట్రంలో శాంతిభద్ర తలను కాపాడిందని, ప్రజలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించగలదని నొక్కిచెప్పారు. రాష్ట్రంలో అల్లర్లను అంతంచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించి యూపీ అభివృద్ధి కొన సాగింపునకు ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..