Thursday, November 21, 2024

పేద‌లు గొప్ప‌గా జీవించాల‌నే…డ‌బుల్ బెడ్రూమ్ ఇండ్లు : మంత్రి త‌ల‌సాని

పేదలు గొప్పగా జీవించాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనల మేరకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ సీసీ నగర్ లో నిర్మించిన 264 ఇండ్లను కేటాయించేందుకు లబ్దిదారులను గుర్తించే కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శర్మన్, కార్పొరేటర్ హేమలత లక్ష్మీపతి, సికింద్రాబాద్ ఆర్డీఓ వసంత, హౌసింగ్ హౌసింగ్ ఈఈ వెంకటదాసు రెడ్డి, పలువురు తహసిల్దార్ లు పాల్గొన్నారు.

మంత్రి సమక్షంలో అధికారులు లబ్దిదారులను ఒక్కొక్కరిగా పేర్లతో పిలిచి మిగిలిన లబ్దిదారులను స్థానికులేనా అని అడిగి నిర్ధారించుకొని అర్హులుగా గుర్తించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్లు, విద్యుత్ లైన్, డ్రైనేజి, త్రాగునీటి పైప్ లైన్ ల ఏర్పాటు వంటి అన్ని వసతులతో ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. లబ్దిదారుల సమక్షంలోనే అర్హులను గుర్తించి ఎలాంటి విమర్శలకు తావులేకుండా లబ్దిదారుల ఎంపికలో ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు వివరించారు. అర్హులైన వారందరినీ గుర్తించి ఇండ్లను కేటాయించడం జరుగుతుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement