Wednesday, November 20, 2024

భారత్‌లో 5జీ ట్రయల్స్‌కు మార్గం సుగమం

భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారులకు శుభవార్త. రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా సంస్థ‌ల‌కు 5జీ స్పెక్ట్రంను టెలికాం విభాగం (డీఓటీ) కేటాయించింది. స్పెక్ట్రం కేటాయింపుతో దేశంలో 5 జీ ట్రయల్స్‌కు మార్గం సుగమమైంది. టెలికాం కంపెనీలకు 700 మెగాహెర్ట్జ్, 3.5 గిగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్ల స్పెక్ట్రంను డీఓటీ కేటాయించింది. డీఓటీ వైర్‌లెస్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ మూడు టెలికాం కంపెనీలకు 5జీ ఎయిర్‌వేస్‌ 100, 800, 10 యూనిట్లను కేటాయించింది.

ఈ 5 జీ ట్రయల్ ఎయిర్‌వేస్‌ను 6 నెలల స‌మ‌యానికి కేటాయించారు. టెలికాం కంపెనీలు పట్టణాల‌తో పాటు గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ట్రయల్స్ నిర్వ‌హించాల్సి ఉంటుంది. డీఓటీ వర్గాల సమాచారం ప్రకారం, పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లో ట్రయల్స్ కోసం స్పెక్ట్రం కేటాయించలేదు. 5జీ ట్రయల్ స్పెక్ట్రం కేటాయింపు రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్‌కు చాలా ముఖ్యమైనది. ఈ రెండు సంస్థలకు 5 జీ-రెడీ నెట్‌వర్క్ ఉన్న‌ది. కరోనా మహమ్మారి స‌మ‌యంలో ఈ రెండు సంస్థల డాటా వినియోగం బాగా పెరిగింది. స్పెక్ట్రం కేటాయింపు ఈ రెండు సంస్థలకు 5 జీ సేవలను త్వరగా ప్రారంభించేందుకు సహాయపడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement